మాదాపూర్‌ హాస్టల్‌లో 30 మంది యువతుల నగ్న వీడియోలు రికార్డు

హైదరాబాద్‌ మాదాపూర్‌లో దారుణం జరిగింది. వర్కింగ్ ఉమెన్స్‌ హాస్టల్‌లో అమ్మాయిల నగ్న వీడియోలను ఒక బాలుడు రికార్డు చేశాడు. దీంతో కలకలం రేగింది. హాస్టల్‌కు పక్కనే ఉన్న ఇంటిలో ఉంటున్న బాలుడు తన సెల్‌ఫోన్‌తో వీడియోలు
రికార్డు చేసేవాడు.

బాలుడుంటున్న ఇంటి గోడకు ఆనుకునే హాస్టల్‌ బాత్‌ రూం ఉండడంతో అతడు తన సెల్‌ఫోన్‌తో అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో రికార్డు చేశాడు. అయితే అనుమానం వచ్చిన ఒక అమ్మాయి ఈ విషయాన్ని పసిగట్టింది.

వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేసిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఖరీదైన అండ్రాయిడ్‌ ఫోన్ కొనివ్వడంతో దాని సాయంతో బాలుడు వీటిని రికార్డు చేశాడు. పోలీసులు వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు.

బాలుడి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపించారు. దాదాపు 30 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను బాలుడు రికార్డు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పిల్లాడి సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. రికార్డు చేసిన వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

మాదాపూర్‌లో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఒక హాస్టల్‌లో మాత్రమే ఇది జరిగింది. బాలుడు మైనర్ కావడంతో అతడిని మీడియాకు చూపించడం లేదు. హాస్టల్ వివరాలను కూడా ప్రసారం చేయవద్దని పోలీసులు మీడియాకు సూచించారు.