బాలక్రిష్ణ టైటిల్ తో వస్తున్న అల్లరి నరేష్

కామెడీ హీరో అయిన అల్లరి నరేష్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హీరో ఎలాగైనా హిట్ కొట్టాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఈ హీరోకి హిట్ ఇవ్వలేకపోతున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “మహర్షి” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో పాటు హీరోగా కూడా రెండు సినిమాలు చేస్తున్నాడు నరేష్.

సత్తిబాబు దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు గిరి అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో గిరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి “బంగారు బుల్లోడు” అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. బాలక్రిష్ణ, రవీనా టాండన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో 1993లో రిలీజ్ అయిన “బంగారు బుల్లోడు” సినిమా టైటిల్ ని ఇప్పుడు అల్లరి నరేష్ కోసం పరిశీలిస్తున్నారు. గతంలో “సుందరకాండ” “యముడికి మొగుడు” “ఆహ నా పెళ్లంట” లాంటి ఓల్డ్‌ టైటిల్స్‌ తో ఆకట్టుకున్న నరేష్ ఇప్పుడు ఈ “బంగారు బుల్లోడు” అనే టైటిల్ తో అయిన హిట్ కొడతాడో లేదో చూడాలి.