జనవరి నుంచి షూటింగ్ లో “మన్మధుడు 2”?

ఇటివలే “దేవదాస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున ప్రస్తుతం మరో రెండు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఒకటి హిందీలో తెరకెక్కుతున్న “బ్రహ్మాస్త్ర” కాగా మరొకటి ధనుష్ తెరకెక్కిస్తున్న తమిళ సినిమా. వేరే బాషల్లో సినిమా చేస్తున్న నాగార్జున ఇప్పటి వరకు తెలుగు లో మాత్రం ఒక్క సినిమా కూడా ఓకే చెయ్యలేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం ఒక తెలుగు సినిమాతోనే తన న్యూ ఇయర్ ని చేసుకుంటాడు అంట నాగార్జున.

“చిలసౌ” సినిమాతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ తన కొత్త సినిమాలో నటించనున్నాడట. సూపర్ హిట్ సినిమా “మన్మధుడు” సినిమాకి సిక్వెల్ గా “మన్మధుడు 2” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. ప్రస్తుతం కథ పై వర్క్ చేస్తున్న రాహుల్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తెచ్చేలా చూస్తున్నాడు. నాగార్జున కూడా జనవరి వరకు తను చేస్తున్న సినిమాల నుంచి కొంచెం ఫ్రీ అవుతాడు కాబట్టి అప్పుడే రెగ్యులర్ షూటింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.