నెంబర్ “118” అంటున్న కళ్యాణ్ రామ్

ఈ ఏడాది “ఎం.ఎల్.ఏ” సినిమాతో ఒక యావరేజ్ హిట్ ని అలాగే “నా నువ్వే” సినిమాతో ఒక ఫ్లాప్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా హిట్ కొట్టాలి అంటే ఆశతో మరో సినిమాతో రెడీ అయిపోయాడు కళ్యాణ్ రామ్.

ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ గుహన్ తో కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకునే పనిలో వున్నాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 2019 లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా కి న్యూమరికల్ టైటిల్ గా “118” ని ఫిక్స్ చేశారట. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి ఈ టైటిల్ సరైనది అని భావించి ఈ టైటిల్ ని ఫిక్స్ చేశాడట గుహన్. ఈస్ట్ కోస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ పై మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.