ప్రపంచ మహిళా బాక్సింగ్ లో మేరీకోమ్ సరికొత్త చరిత్ర

  • ఆరోసారి బంగారు పతకం సాధించిన భారత బాక్సింగ్ గ్రేట్
  • 2018 ప్రపంచ బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో మేరీ విజయం
  • దేశానికి ఆరో బంగారు పతకం అంకితమంటున్న మేరీ కోమ్
  • ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నాపై మేరీ కోమ్ గెలుపు

భారత మహిళా బాక్సింగ్ గ్రేట్, ముగ్గురు బిడ్డల తల్లి మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది.

 ఆరోసారి ప్రపంచ బంగారు పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో 35 ఏళ్ల మేరీ కోమ్…ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను చిత్తు చేసి..బంగారు పతకాలు సాధించడంలో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

తన ఆరో బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు… మేరీకోమ్ ప్రకటించింది. ఇప్పటి వరకూ తన కెరియర్ లో ఆరు స్వర్ణ, ఓ రజతం తో సహా ఏడు ప్రపంచ పతకాలు సాధించిన ఏకైక మహిళ మేరీకోమ్ మాత్రమే కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.