షకీలా వచ్చేసింది… ఫస్ట్ లుక్ ఇదిగో

దాదాపు రెండు దశాబ్దాల కిందట కుర్రకారును ఉర్రూతలూగించిన షకీలా మళ్లీ వస్తోంది. సౌత్ సెన్సేషనల్ అడల్ట్ స్టార్ షకీలా జీవితం, దృశ్యరూపంలోకి మారింది. ఆమె బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నాట్ ఏ పోర్న్ స్టార్ అనేది ట్యాగ్ లైన్.
టోటల్ సౌత్ తో పాటు బాలీవుడ్ మొత్తం షకీలా బయోపిక్ కోసం ఎదురుచూస్తోంది. దీనికి ఓ బలమైన కారణం ఉంది. ఆమె జీవితంలో ఎన్నో వివాదాస్పద సంఘటనలు ఉన్నాయి. పైగా అప్పట్లో సౌత్ మొత్తంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా రికార్డుకెక్కింది షకీలా. అలాంటి నటి జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నాడు దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్.
ఈ బయోపిక్ లో షకీలాలా రిచా చద్దా నటిస్తోంది. షకీలా లుక్స్ ఆమెలో కనిపించకపోయినా.. షకీలా హావభావాల్ని మాత్రం ఆమె అద్భుతంగా పండించిందని అంటున్నాడు దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదలకాబోతోంది షకీలా.