సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా “ఆర్.ఆర్.ఆర్”.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో “బాహుబలి” సినిమాకి పాటించిన ఒక టెక్నిక్ ని పాటిస్తున్నాడు రాజమౌళి. అదేంటంటే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగబోతుంది. ఇక్కడే వేసిన ఒక పెద్ద సెట్ లో కొన్ని రోజుల పాటు సీన్స్ ని షూట్ చేస్తాడు అంట రాజమౌళి.

అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చిత్ర యూనిట్ అందరు ఉండేలా ఓ భారీ సెట్ వేయించాడట. ఈ సెట్ లోనే కొన్ని రూమ్స్ ని డివైడ్ చేసి టీం కి ఇస్తారు అంట. “బాహుబలి” విషయంలో కూడా రాజమౌళి ఇలాగే చేసాడు. సినిమా మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే తెరకెక్కుతుంది కాబట్టి టీం మొత్తానికి రామోజీ ఫిలిం సిటీలోనే రూమ్స్ అరేంజ్ చేయించాడు రాజమౌళి. ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమాలో హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారు మూవీ యూనిట్.