పరిటాల శ్రీరాంపై కోర్టుకు వెళ్తాం….

టీడీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ లీగల్‌ సెల్‌ పిలుపునిచ్చింది. అనంతపురంలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన న్యాయవాది పొన్నవోలు సుధాకర్… అక్రమ కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన పని లేదన్నారు.

న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటామని… బాధితులకు వైసీపీ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. న్యాయపోరాటంతోనే టీడీపీకి బుద్ది చెబుతామన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు తిడుతున్నా కేసులు నమోదు చేయలేని స్థితిలో పోలీసులున్నారన్నారు. చంద్రబాబు కనీస నైతిక విలువలను కూడా పాటించడం లేదన్నారు. పరిటాల శ్రీరామ్ ఆగడాలపై పోరాటం చేస్తామన్నారు. పరిటాల శ్రీరాంపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించిందని… ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే మళ్లీ కోర్టుకు వెళ్తామని సుధాకర్ చెప్పారు.