నేను సేఫ్ జోన్ లో ఉన్నాను కాబట్టి….

టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. కావాలనుకుంటే స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. కానీ సమంత మాత్రం స్టార్స్ సరసన నటించనంటోంది. తన మనసుకు నచ్చిన కథల్లో మాత్రమే కనిపిస్తానంటోంది. కేవలం సమంత తప్పుకుంది కాబట్టే, ఎన్నో పెద్ద సినిమాలు ఇతర హీరోయిన్లకు వెళ్లిపోతున్నాయి. మరి బాధగా లేదా? స్టార్ డమ్ తగ్గిపోతే ఏం అనిపించదా? అనే ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్టు స్పందించింది సమంత.

“నేను ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాను. కాబట్టి నా మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తాను. నాకు బాగా నచ్చాయి కాబట్టే కష్టపడి డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాను. నిజంగా నాకు నచ్చకపోతే సినిమా చేయను. కావాలంటే ఫ్రీగా ఇంట్లో కూర్చుంటాను. నేను సినిమాలు చేయకపోతే ఎవరూ నన్ను అడగరు. ఇలాంటి సేఫ్ జోన్ లో ఉన్నాను కాబట్టే యూటర్న్ లాంటి సినిమాలు చేయగలుగుతున్నాను” ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసింది సమంత.

యూటర్న్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. నిజమే…. సమంత కావాలనుకుంటే స్టార్ హీరోలంతా అవకాశాలిస్తారు. కానీ ఆమె స్టార్స్ తో చేయనంటోంది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోల సరసన నటిస్తే బాగుండదని, మంచి కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది.