పక్క రాష్ట్రానికి రూ.23 వేల కోట్ల పంగ”నామా”లు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ దోపిడికి తెరలేచింది. ఏకంగా రూ. 23వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు రంగం సిద్దమైంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన బంధాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ టీడీపీ ఎంపీ, తన ఇష్టుడు అయిన నామా నాగేశ్వరరావుకు ఏపీ ప్రజల సొమ్ము దోచిపెట్టేందుకు చంద్రబాబు తెరవెనుక వేగంగా పావులు కదుపుతున్నారు. అంతర్జాతీయంగా చమురు, బొగ్గు ధరలు భారీగా పతనమవడంతో దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఆ కోవలోనే ఏపీలోనూ ప్రస్తుతం మిగులు విద్యుత్‌ భారీగా ఉంది. కానీ చంద్రబాబు క్విడ్‌ ప్రోకో ఆటలో భాగంగా నామాకు చెందిన రెండు విద్యుత్ సంస్థల నుంచి రూ. 23 వేల కోట్ల విలువైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.

ఏటా 600 మెగావాట్ల విద్యుత్‌ను 12ఏళ్ల పాటు కొనుగోలు చేసేందుకు ఈఒప్పందం. అయితే ఈ ఒప్పందం సంగతి తెలుసుకుని సదరన్‌ పవర్ డిస్పాచ్ సెంటర్ కంగుతింది. మిగులు విద్యుత్ ఉన్న సమయంలో అంతభారీగా విద్యుత్ కొనడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే డిమాండ్ లేక కృష్టపట్నం, కడప ఆర్టీపీపీలో ఉత్పత్తిని తగ్గించిన విషయాన్ని కూడా డిస్పాచ్ సెంటర్ గుర్తు చేసింది. ఈ విషయాన్ని విద్యుత్ అదికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కస్సుమన్నారు.  నామా కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో నామా కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే…

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ యూనిట్‌ 2రూపాయలకే దొరుకుతోంది. కానీ నామా కంపెనీ నుంచి 4.43 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం లెక్కల ప్రకారం రోజుకు రూ. 5.31 కోట్ల విలువైన విద్యుత్‌ను కొంటారు. అంటే ఏడాదికి రూ. 1940 కోట్లు. ఒప్పందకాలం 12ఏళ్లకు రూ. 23. 280 కోట్లు అన్న మాట. నామా నాగేశ్వరరావుకు చెందిన రెండు కంపెనీలు కూడా విదేశీ బొగ్గుతో నడుస్తున్నవే. ఒకవేళ అక్కడ బొగ్గు ధరలు పెరిగితే తిరిగి యూనిట్‌ ధరను పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అది చంద్రబాబు సొంత రాజ్యంలో, సొంతమనుషుల కోసం సాగుతున్న బరితెగింపు పరిపాలన తీరు.

Click on Image to Read:

mlc-satish-reddy

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1