వైఎస్‌ ఫ్యామిలీ మీద గెలవడమే లక్ష్యం… జగన్‌లో ఆ కల్చర్ కనిపించలేదు

పులివెందుల్లో వైఎస్‌ కుటుంబం మీద గెలవడమే తన లక్ష్యమని టీడీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. అయితే దౌర్జన్యాలు, హింసామార్గంలో కాకుండా ప్రజల మనసు గెలిచి ఎన్నికల్లో నెగ్గాలన్నదే తన కోరిక అన్నారు. జగన్‌తో తనకు రహస్య సంబంధాలు ఉన్నాయన్న మాట అవాస్తవం అన్నారు. అలా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలను మానేస్తానన్నారు. రాజారెడ్డిని హత్య చేసిన పార్థసారథికి తాను ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవమేనని సతీష్ రెడ్డి అంగీకరించారు. అయితే పార్థసారథి టీడీపీ వ్యక్తి కావడం, ఆయన ఇంటి మీద దాడులు జరుగుతున్నట్టు తెలియడంతోనే తాను ఆశ్రయం కల్పించానన్నారు. రాజారెడ్డి హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు వైఎస్‌కుటుంబ సభ్యులు కూడా చెప్పలేరు అనిఅన్నారు. తాను ఎలాంటి వాడినో వారికి కూడా తెలుసన్నారు. వైఎస్‌ చాలా తెలివైన వాడని… తండ్రి సాయంతో ప్రత్యర్థులను నిర్మూలించేవాడని చెప్పారు. వైఎస్‌ కుటుంబంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని, అలా కాకుంటే ఆ స్థాయికి ఎదిగేవారు కాదన్నారు. కాకపోతే వారు చేయించిన హత్యా రాజకీయాలను ప్రముఖంగా చూడాలన్నారు.

గతంలో వైఎస్‌ కుటుంబం రిగ్గింగ్ చేసుకుని గెలిచేదన్నారు. అయితే ప్రస్తుతం ప్రత్యర్థులపై జగన్ దాడులు చేయిస్తున్న దాఖలాలైతే కనిపించలేదన్నారు. రిగ్గింగ్ యాక్టివిటీస్‌ కూడా జగన్‌లో లేవనే తాను అనుకుంటున్నానన్నారు.. 2014 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగలేదన్న మాట కూడా వాస్తవమేనన్నారు. 35 ఏళ్లుగా పులివెందుల ప్రజలు ఏ పని కావాలన్నా వైఎస్ కుటుంబం దగ్గరకు వెళ్లడానికి అలవాటు పడ్డారని కానీ తొలిసారిగా ఇప్పుడు ప్రజల తమ వైపు వస్తున్నారని చెప్పారు. జగన్‌ సొంతూరు బలపనూరులో తాగేందుకు నీరు లేకపోతే తామే వెళ్లి బోర్లు వేయించామన్నారు. బలపనూరు సర్పంచ్ బై ఎలక్షన్‌లో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రమేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని.. కాకపోతే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆయనదే  అంతా జరగాలని అన్నప్పుడు అలా కాదు అందరికీ సమాన అవకాశాలుండాలని సూచించామన్నారు.

Click on Image to Read:

deccan-chronicle-chief-krishna-rao

ys-jagan1

kcr-chandrababu-naidu