మహేష్-కొరటాల సినిమా డీటేయిల్స్

కొరటాల శివ డైరక్ట్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కొరటాల తలుచుకుంటే వెంటనే మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయొచ్చు. కానీ కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మహేష్ తో చేయాల్సిన మరో సినిమాపై పూర్తిగా దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే జనతా గ్యారేజ్ తర్వాత మరే హీరోకు కమిట్ మెంట్ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం… మహేష్-కొరటాల శివ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. అప్పటికే మురుగదాస్ సినిమాను వీలైనంత ఎక్కువ భాగం పూర్తిచేయాలని మహేష్ భావిస్తున్నాడు. సో.. కొరటాలకు ఇప్పుడు సరిగ్గా 4 నెలల టైం ఉంది. మహేష్ కు ఇప్పటికే స్టోరీలైన్ వినిపించిన కొరటాల శివ, ఈ 4 నెలల టైమ్ లో కథలో కొన్ని మార్పులు చేయడంతో పాటు స్క్రీన్ ప్లేను కూడా పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. అందుకే 4 నెలలు గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తను టీం సభ్యులంతా ఆ పనిమీదే ఉన్నారని కొరటాల స్పష్టంచేశాడు. ఈ సినిమా కూడా మైత్రీ మూవీస్ బ్యానర్ పైనే రాబోతోంది.

Click to read

పవన్ సినిమా కోసం మరో టైటిల్… పవన్ సినిమా కోసం మరో టైటిల్…