కృష్ణవంశీ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్

మెగా హీరోలు గెస్ట్ రోల్స్ చేయడం చాలా అరుదు. అది పెద్ద హీరో కావొచ్చు లేదంటే ఇప్పుడిప్పుడే రైజింగ్ లో ఉన్న హీరోలైనా కాావొచ్చు. ఎవరైనా కానీ మెగా హీరోలు గెస్ట్ రోల్స్ కు కాస్త దూరమే. ఆ గీతను బన్నీ ఇప్పుడిప్పుడే చెరిపేస్తున్నాడు. రుద్రమదేవి సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. సినిమాకు అది ఎంతో ప్లస్ అవ్వడంతో పాటు బన్నీకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు బన్నీ బాటలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ కూడా ఉన్నాడు. సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్న ఈ హీరో… ఇప్పుడు గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాియిధరమ్ తేజ… ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించేందుకు అంగీకరించాడు. ఈ మేరకు కృష్ణవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయాన్ని స్పష్టంచేసిన కృష్ణవంశీ… త్వరలోనే సాయిధరమ్ తేజతో షూటింగ్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. మెగా హీరో చేరికతో నక్షత్రం ప్రాజెక్టుపై హైప్ పెరిగింది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.