సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు బిజీగానే ఉంది సన్నీలియోన్. వరుసగా అవకాశాలు ఆమెను వరిస్తూనే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా…. ప్రతి పరిశ్రమలో సన్నీ ముద్ర వేసింది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిపోయింది. హిందీ చిత్రసీమలో ఇప్పుడు ఆమె కోసం కథలు రాసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఇదిలా ఉండగా.. ఎప్పుడు బిజీగా ఉండే సన్నీలియోన్… ఎట్టకేలకు కాస్త ఫ్రీ అయింది. ఒక రోజంతా ఆమె ఇంట్లోనే గడిపింది. ఈ ఖాళీ సమయంలో బాహుబలి సినిమా చూసింది సన్నీలియోన్. సినిమా చూసిన వెంటనే మొబైల్ అందుకుంది. బాహుబలి సినిమాను ఎట్టకేలకు చూశానని… సినిమా చాలా బాగుందని మెచ్చుకుంది. సెకెండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

బాలీవుడ్ లో సన్నీలియోన్ హవా నడుస్తోంది. చిన్నచిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన సన్నీ లియోన్… ప్రస్తుతం బాలీవుడ్ తెరపై తన బయోపిక్ ను ఆవిష్కరించాలని అనుకుంటోంది. భారతీయ మూలాలు కలిగిన ఈ బ్యూటీ… తను ఎలా మోడల్ గా ఎదిగింది, పోర్న్ ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అక్కడున్న ఇబ్బందులేంటి… తిరిగి బాలీవుడ్ లో ఎలా ప్రవేశించింది… ఇలాంటి ఘట్టాలన్నింటినీ కలిపి తన బయోపిక్ ను వెండితెరపై చూపించే ప్లాన్స్ లో ఉంది. అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సన్నీలియోన్ భర్త వెబర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.