రజనీకాంత్ ను వృద్ధాశ్రమంలో చేర్పించండి

ఇది మేం అంటున్న మాట కాదు. ఓ తమిళ పౌరుడు అంటున్న మాట. కేవలం విమర్శలే కాదు.. తమిళనాడులోని వడపళనికి చెందిన కందస్వామి అనే వ్యక్తి ఏకంగా పోలీస్ కమిషనర్ కు ఓ లేఖ ఇచ్చాడు. ఆ లేఖలో రజనీకాంత్ ను ఓల్డేజ్ హోంలో చేర్పించాలని డిమాండ్ చేశాడు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమాపై చాలా హైప్ క్రియేట్ చేశారని, అందుకే తను 12వందల రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కొని మరీ వెళ్లానని చెప్పిన కందస్వామి… తీరా థియేటర్లలోకి వెళ్లిన తర్వాత 66ఏళ్ల ముసలాడితో ఫైట్లు చూపించారని… తనను నిలువునా మోసంచేశారని ఆరోపిస్తున్నాడు.

సీనియర్ సిటిజన్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా తమిళనాడు ప్రభుత్వం… వృద్ధుడైన రజనీకాంత్ ను వృద్ధాశ్రమంలో చేర్పించి… తమలాంటి వారని ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాడు. అంతేకాదు… సినిమాపై హైప్ క్రియేట్ చేసి తనను మోసం చేసిన దర్శకుడు రంజిత్, నిర్మాత ధానుపై గట్టి చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేస్తున్నారు. ఈ లేఖపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేరని విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తలైవ ఫ్యాన్స్ నుంచి కందస్వామికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో అని పోలీసులు భయపడుతున్నారు.