బాబు బంగారం నుంచి మరో సాంగ్

ఆడియో విడుదలకు ముందే కొన్ని పాటల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ప్రజెంట్ ట్రెండ్. బాలీవుడ్ లో ఎప్పట్నుంచో నడుస్తున్న ఈ ట్రెండ్ ను టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఒంటబట్టించుకుంటోంది. ఇందులో భాగంగా బాబు బంగారం టీం కూడా ఇప్పటికే ఒక పాట విడుదల చేసింది. తాజాగా సెకెండ్ సాంగ్ ను కూడా నెట్ లో రిలీజ్ చేసింది. దిల్లున్న వాడే అంటూ సాగే ఈ థీమ్ సాంగ్ కు దగ్గుబాటి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. 
ఈ సినిమా ఆడియో విడుదల తేదీని కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు. జులై 24న ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 2 పాటల్ని మరోసారి రిలీజ్ చేయడంతో పాటు… మిగిలిన 4 పాటల్ని కూడా అదే రోజు విడుదల చేస్తారు. ఇక సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో పాటు… ఓ సాంగ్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. ప్రస్తుతం యూనిట్ సభ్యులు నయనతార కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. నయనతార నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే… మిగిలిన ఆ ఒక్క పాట షూటింగ్ ను పూర్తిచేస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో విడుదల రోజున థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.