బాహుబలి దారిలో సెల్ఫీరాజా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాతో అల్లరోడు నటించిన సెల్ఫీరాజాను పోల్చగలమా…? కలలో కూడా ఊహించని పోలిక ఇది. కానీ ఒకేఒక్క యాంగిల్ లో బాహుబలిని, సెల్ఫీరాజాను కలిపి చూడొచ్చు. అదే రివ్యూ యాంగిల్. అవును… ప్రారంభంలో బాహుబలికి కూడా కొన్ని నెగెటివ్ రివ్యూలే వచ్చాయి.. కానీ అది ఏ స్థాయిలో రికార్డులు సృష్టించిందో అందరం చూశాం. ఇప్పుడు సెల్ఫీరాజాది కూడా అదే దారి.
రిలీజైన వెంటనే సెల్ఫీరాజాపై సైట్లు అన్నీ విరుచుకుపడ్డాయి. ఇదేం సినిమా అంటూ కామెంట్లు చేశాయి. సినిమాకు కొన్ని వెబ్ సైట్స్ అయితే 1.5 రేటింగ్ కూడా ఇచ్చాయి. కానీ అల్లరోడు కోసం ఓ సెక్షన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అతడి కామెడీకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఫ్లాప్ అనుకున్న సెల్ఫీ రాజా కూడా బ్రేక్ ఈవెన్ సాధించాడు. విడుదలైన 3 రోజులకే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యాడు. 
మ్యాగ్జిమమ్ పేరడీలతో నడిపించిన సెల్ఫీ రాజా సినిమాలో కొన్ని స్పూఫ్ లు ప్రేక్షకుల్ని బాగానే ఎట్రాక్ట్ చేశాయి. బన్నీని అనుకరిస్తూ చేసిన చెప్పను బ్రదర్ అనే స్పూఫ్ తో పాటు… నాన్నకు ప్రేమతో, బాహుబలి, బెంగాల్ టైగర్, సరైనోడు సినిమాల్ని అనుకరిస్తూ చేసిన సన్నివేశాలు బాగానే నవ్వులు పూయిస్తున్నాయి. అలా ఒక్క నైజాంలోనే ఈ 3 రోజుల్లో కోటి 30లక్షల రూపాయల షేర్ సాధించింది ఈ సినిమా. అల్లరి నరేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లు ఇవి. వీటితో పాటు మిగతా ఏరియాస్ లో కూడా సెల్ఫీరాజా డీసెంట్ కలెక్షన్లు సాధించడంతో… ప్రాఫిటబుల్ వెంచర్ గా మారింది.