చెర్రీ కొత్త సినిమా ఫస్ట్ లుక్

ఈమధ్య ప్రీ-లుక్ అంటూ చెర్రీ ఓ పోస్టర్ విడుదల చేశాడు. ఎవడు లేదా నాయక్ సినిమాలోంచి ఓ స్టిల్ తీసి, ఫొటోషాప్ లో జిమ్మిక్కులు చేసి ప్రీలుక్ అంటూ విడుదల చేశారు. అప్పట్లో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నిజంగానే చెర్రీ కొత్త సినిమాకు సంబంధించి ఫొటో విడుదలైంది. అంతేకాదు… చెర్రీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా దాదాపు ఇదే. ఓ తమిళ చిత్రం రీమేక్ గా రూపొందుతోన్న రామ్‌చరణ్ చిత్రం ధ్రువ. ఇటీవల కశ్మీర్ లో  షెడ్యూల్ పూర్తి చేసుకుని  చిత్ర బృందం హైదరాబాద్‌ చేరుకుంది. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. అధికారికంగా ఈ సినిమాలో చరణ్‌కి సంబంధించి స్టిల్స్‌ని విడుదల చేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చెర్రీ బాగానే హల్‌చల్ చేస్తున్నాడు. లొకేషన్లో చెర్రీతో తీసుకున్న ఓ ఫొటోను నవదీప్… తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ‘ధృవ’లో పోలీస్ ఆఫీసర్‌ గెటప్ లో… చరణ్ ఈ ఫొటోలో న్యూ లుక్‌తో, ఖాకీ దుస్తుల్లో దర్శనమివ్వడంతో మెగా అభిమానులు ఇదే ఫస్ట్‌లుక్ అంటూ పండగ చేసుకుంటున్నారు. అయితే త్వరలో అధికారికంగా ‘ధృవ’ ఫస్ట్‌లుక్ ను విడుదల చేస్తారు.