డిటెక్టివ్ ఉమా ముందు పుస్తకాలు చదువు… నీకు మర్యాదలు చేయలేక సిబ్బంది వాపోతున్నారు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లిలో తాను ప్రభుత్వ భూములు ఆక్రమించినట్టు మంత్రి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యేబుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. 1929 నుంచి ఆ భూములు తమ కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ఆహార ఉత్పత్తిని పెంచేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వమే వ్యవసాయం చేసుకునే వారికి ఉచితంగా భూములు పంపిణి చేసిందని చెప్పారు. ఈ విషయం తెలియాలంటే ముందు దేవినేని ఉమ పుస్తకాలు చదివి నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు.

1929లోనే తాము భూములు ఆక్రమించి ఉంటే ఇంతకాలం ఇన్ని ప్రభుత్వాలు తన మీద ప్రేమతో మౌనంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. 1929 నుంచి ఏ ప్రభుత్వం కనిపెట్టలేని విషయాన్ని తానో డిటెక్టివ్‌ తరహాలో కనిపెట్టానని ప్రచారం చేసుకోవడం ఉమా మానుకోవాలని సూచించారు. ఈ భూముల విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నా కూడా బాధ్యతాయుతమైన మంత్రి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.

తాము సాగునీటి కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పడం లేదన్నారు. తనతో పాటు కాలువ నిర్మాణంలో భూములు పొగుట్టుకుంటున్న వారంతా కేవలం చట్టబద్ధంగానే భూములు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వమే దౌర్జన్యంగా భూములు లాక్కోవాలనుకుంటే అది అయ్యేపనికాదన్నారు. దేవినేని ఉమ కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఆయనకు సౌకర్యాలు కల్పించలేక ఇరిగేషన్ అధికారులు గగ్గోలు పెడుతున్నారని బుగ్గన అన్నారు. ఈ విషయం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. కర్నూలు జిల్లాకు ఉమ పదేపదే ఎందుకొస్తున్నారో అర్థం కావడం లేదని అధికారులే చెబుతున్నారని బుగ్గన అన్నారు.

Click on Image to Read:

rammurty-naidu-chandrababu-

C-Narasimha-Rao

kommineni-amar

vastu-tax

jc-diwakar-reddy

laxmi parvathi

devineni

sakshi

kodali

jyotula

kotamreddy-sridhar-reddy

gottipati

YSRCP-Extensive-Meeting

byreddy-rajashekar-reddy

darmana

bhumana-karunakar-reddy

bhuma-jyotula

trivikaram