మొదటి సంపాదనతో కారు కొనుక్కుంది

 ఒక మనసు అనే సినిమాతో తెరంగేట్రం చేస్తోంది మెగా ముద్దుగుమ్మ నిహారిక. నాగబబు కూతురిగా, టీవీ యాంకర్ గా, వెబ్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఇన్నాళ్లూ సుపరిచితమైన ఈ బుట్టబొమ్మ…. నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమాతో వెండితెరపై తళుక్కున మెరవనుంది. ఈ నెల 24న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకాబోతోంది. ఈ సినిమా కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే తెరవెనక సర్దుబాట్లు అన్నీ చేశాడు. ఇదిలా ఉండగా… ఈ సినిమాలో నటించినందుకు గానూ తాజాగా పారితోషికం అందుకుంది నిహారిక. 
టీవీ-9 సంస్థ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. నిహారికకు దశలవారీగా ఎమౌంట్ అప్పజెప్పిన టీవీ9… తాజాగా చివరి పేమెంట్ ను కూడా అందించారట. అలా పోగైన మొత్తం పారితోషికంతో ఈ మెగా హీరోయిన్ ఏకంగా ఆడి కారు కొనుక్కుంది. ఆ కారు పక్కన తన తండ్రితో నిల్చొని ఓ ఫొటో కూడా దిగింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది. ఒక మనసు రిలీజ్ అయి, రిజల్ట్ చూసిన తర్వాత తన రెండో సినిమా గురించి ఆలోచిస్తుందట నిహారిక. అప్పటివరకు తన ఆడి కారులో షికార్లు కొడుతుందట.