త్రివిక్రమ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ…?

అ..ఆ సినిమా ప్రారంభానికి ముందే త్రివిక్రమ్ కు ఈ అవకాశం వచ్చింది. కానీ ఎందుకో అప్పట్లో ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. బాలయ్య తన వందో సినిమా పనిలో బిజీగా ఉండడం వల్ల మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో త్రివిక్రమ్ నితిన్ తో కలిసి అ..ఆ సినిమా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి త్రివిక్రమ్ కు అదే అవకాశం వచ్చింది. మోక్షజ్ఞను వెండితెరపై హీరోగా పరిచయం చేసే అవకాశం మరోసారి త్రివిక్రమ్ కు వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం నందమూరి కాంపౌండ్ లో నడుస్తున్న పుకార్లు కనుక నిజమైతే… త్వరలోనే మోక్షజ్ఞను త్రివిక్రమ్ వెండితెరకు పరిచయం చేయనున్నాడు. 
ప్రస్తుతం తండ్రి బాలయ్య వందో సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాడు మోక్షజ్ఞ. మరి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా… లేక ఆ సినిమా మధ్యలోనే మోక్షజ్ఞను బయటకు తీసుకొచ్చి హీరోగా పరిచయం చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు త్రివిక్రమ్….. పవన్ లేదా సూర్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అ..ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్… తన నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈసారి మోక్షజ్ఞను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తాడా…లేక మరోసారి అ అవకాశాన్ని మిస్ చేసుకుంటాడా అనేది చూడాలి.