చంద్రబాబు రాజకీయంలో ఒక పోకడ కనిపిస్తుంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తన పార్టీ నేతల చేత మూకుమ్మడిగా దాడి చేయిస్తుంటారు. విమర్శలు చేసిన వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేరు చివర కులం పేరు పెట్టుకోవడం ఇష్టం లేని వారిని అదే కులంతో టార్గెట్ చేయిస్తుంటారు. ఉదాహరణకు వైసీపీ ఎమ్మెల్యేరోజా … రెడ్డి సామాజికవర్గానికి చెందినవారైనప్పటికీ ఆమె ఎక్కడా కూడా పేరుచివర రెడ్డి అని పెట్టుకోరు. కానీ దళిత ఎమ్మెల్యే అయిన అనితతో ఆమెకు వివాదం ఏర్పడినప్పుడు టీడీపీ నేతలు పదేపదే రోజారెడ్డి సంబోధించారు. బోండా ఉమా పనిగట్టుకుని రోజారెడ్డి రోజారెడ్డి అంటూ జపం చేశారు. . ఇలా చేయడం ద్వారా ఒక అగ్రకులానికి చెందిన మహిళ… ఒక దళిత మహిళను కించపరిచిందన్న భావన కలిగేలా ప్రచారం చేశారు. అంటే ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకిగా చిత్రికరించే ప్రక్రియ అది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టుగా ఉన్నారు.
దళితులపై జరిగిన ఊచకోతను నిరసిస్తూ తన పేరు చివర రెడ్డిఅన్న పదాన్నితొలగించుకున్న కోదండరాంను కూడా అదే కులం పేరుతో కేసీఆర్ దండు టార్గెట్ చేయడం ఆశ్చర్యమే. కోదండరాం రెడ్డి ఒక విషనాగు, కాంగ్రెస్ ఏజెంట్ అంటూ కోదండరాం కేరీర్ అంత వయసు లేని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారంటే వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకులుకాదు తెలంగాణ ప్రజలు. నిన్నో మొన్నోటీఆర్ఎస్ లో చేరిన ఎంపీ మల్లారెడ్డిని కూడా కోదండరాంకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లో కూర్చోబెడితే జనం ఏమనుకుంటారు? తెలంగాణ సాధనలో ముందుండి నడిచిన కోదండరాం ..కొన్ని విమర్శలు చేస్తే వాటికి సమాధానంచెప్పాలే గానీ కులంపేరుతో, విషనాగు అంటూ ఎదురుదాడి చేయడం ద్వారా కేసీఆర్ తేలిపోయారు. తన లోపాలను ఎత్తిచూపే వారు తయారైతే తన పతనం ఖాయమని భావించారు కాబోలు. అందుకే కోదండరాంను కులం పేరుతో టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వం రెడ్ల చేతిలో ఉందికాబట్టి కోదండరాం తన సామాజికవర్గం కోసం పనిచేస్తున్నారన్న భావన కలిగించేందుకు ప్రొఫెసర్ కులాన్ని తెరపైకి తెచ్చారు.
కేసీఆర్ పాలనను ఒక్క కోదండరామే కాదు… ప్రొఫెసర్ హరగోపాల్ లాంటివాళ్లు కూడా తీవ్రంగానే విమర్శిస్తున్నారు. మరి వాళ్లు కూడా విషనాగులేనా, వారుకూడా కాంగ్రెస్ ఏజెంట్లేనా!. అయినా ఏ ధనికవర్గం తెలంగాణను కొల్లగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపించిందో ఇప్పుడు అదే బడా కాంట్రాక్టులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న టీ ప్రభుత్వ పెద్దలు …
Click on Image to Read: