పరుచూరి అశోక్ బాబు ఎవరి మనిషి? మళ్లీ “ఆపరేషన్ పైకి లేపుడు” మొదలైందా?

జూన్ 27 నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు వెలగపూడి తరలి వెళ్లాల్సిందేనన్న ప్రభుత్వ అల్టిమేటం పెను దుమారమే రేపుతోంది. ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడిలో కార్యాయాలు లేవు, రోడ్లు లేవు, విద్యుత్ లేదు,  ప్రభుత్వ కార్యక్రమాలన్ని, ప్రతిఫైలు, ఈ-ఫైలుగా నడుస్తున్న ఈ సమయంలో ఇంటర్ నెట్ సౌకర్యం లేకుండా అక్కడికి వెళ్లి తామేమీ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వెలగపూడికి వెళ్లినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి బస్సే బురదలో చిక్కుపోయిందని… అలాంటి చోట పరిపాలన ఎలా సాధ్యమవుతుందని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఉద్యోగ సంఘాల నేతల తీరుపైనా చిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉద్యోగులందరికీ తానే లీడర్ అన్నట్టు కోతలు కోసిన అశోక్‌ బాబు ఇప్పుడేం చేస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొన్నివారాలుగా తమ జీవితాలపై తాము ఆందోళన చెందుతుంటే ఉద్యోగ నేతలు ఎందుకు గట్టిగా స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. అశోక్‌ బాబు లాంటి వారు తొలి నుంచి కూడా ప్రభుత్వానికి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులపై నమ్మకం సన్నగిల్లడంతో వాళ్లు లేకుండానే ఇటీవల సచివాలయ ఉద్యోగులే స్వయంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంతకాలం ఉద్యోగుల తరలింపుపై పొడిపొడి మాటలతో సరిపెట్టిన అశోక్‌ బాబు.. తీరా ఉద్యోగుల్లో తమపై నమ్మకం సడలుతోందని గమనించి కొత్త ఎత్తు వేస్తున్నారని కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాయకత్వం తన చేతుల్లో నుంచి జారిపోకుండా ఉండేందుకు ఇప్పుడు ఉద్యోగుల తరుపున రంగంలోకి దిగారని మండిపడుతున్నారు. ఇన్నిరోజులుగా ఉద్యోగుల తరలింపులో గట్టిగా మాట్లాడని అశోక్ బాబు… ఆదివారం స్పందించారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉద్యోగులు తరలించడం సరికాదన్నారు. ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని కోరారు. ఈ వ్యాఖ్యల వెనుక నాయకత్వాన్నికాపాడుకునే ప్రయత్నమే తప్ప అశోక్‌బాబుకు నిజమైన చిత్తశుద్దిలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అశోక్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లు ”అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు” అంటూ బ్రేకింగ్‌లు వేయడం ద్వారానే అసలు విషయం అర్థమవుతోందంటున్నారు.

అశోక్‌బాబు స్థానంలో మరో ఉద్యోగ నాయకుడు ఎదిగితే చంద్రబాబుకు అనుకూల పరిస్థితి ఉండదని అందుకే అశోక్‌బాబును మళ్లీ పైకి లేపేందుకు టీడీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగిందంటున్నారు. మొత్తం మీద సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అశోక్‌ బాబు ఇప్పుడు ఆ స్థాయిలో స్పందించకపోవడం అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది.

Click on Image to Read:

jagan-anantapur

YS-Jaganmohan-reddy

jagan-anantapur

ysrcp-anantapu-rally

YS-Jagan

nara-lokesh-twitter

chandrababu

gutta

mla-attar-basha

chandrababu-naidu

ys-jagan-yatra

anam-vivekananda-reddy-comm

telangana-congress