ముఖ్యమంత్రి చంద్రబాబు అంతటి వివాదాస్పద వ్యక్తి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే లేడన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. రాజకీయాలను భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలపై జగన్ నిరంతరం చేస్తున్న పోరాటాన్ని చూసి తన రాజకీయ జీవితం సమాధి అయిపోతోందన్న భయంతో చంద్రబాబు ఉన్నారని అన్నారు. జగన్ పోరాట పఠిమే వైసీపీ ఆస్తి అని భూమన చెప్పారు.
చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, హత్యలతోనే సాగిందన్నారు. వైఎస్‌ను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో 1991 సాధారణ ఎన్నికల్లో కడప పార్లమెంట్ ఇంటిపెండెంట్ అభ్యర్థి పోలంకి వెంకటసుబ్బయ్యను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వైఎస్ ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు వెంకటసుబ్బయ్య హత్యాఘాతుకానికి తెగించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు వద్ద రూ. 50 లక్షల లంచం తీసుకున్న మాట వాస్తవం కాదా అనిప్రశ్నించారు. అయితే చివరకు ఎన్టీఆర్ టికెట్‌ను మరొకరికి ఇవ్వడంతో గిరిజన కోటయ్యను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని భూమన ప్రశ్నించారు.
చంద్రబాబు జీవితం అంతా ఇలాగే సాగిందన్నారు. బేతాళమాంత్రికుడి లాంటి వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఉద్యోగులను బలవంతంగా వెలగపూడికి తరలించే ప్రయత్నం వెనుక కూడా కుట్ర ఉందన్నారు. ఓటుకు నోటు తర్వాత కేసీఆర్ బెదిరింపులకు భయపడే చంద్రబాబు ఇలా నిర్మాణాలు పూర్తికాకముందే ఉద్యోగులను తరలిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై తమ యుద్దం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
Click on Image to Read: