సెల‌వు గొడ‌వ‌…ప్రాణాన్ని తీసింది!

సెల‌వు  విష‌యంలో జ‌రిగిన గొడ‌వ‌లో ఒక స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం సైనికుడు త‌న పై అధికారిని కాల్చి చంపాడు.  రాజ‌స్థాన్‌కి చెందిన బిఎస్ఎఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ రామ్ గోపాల్ మీనా (45) మే 16న జ‌ర‌గ‌నున్నఎన్నిక‌ల తాలూకూ  విధుల్లో పాల్గొనేందుకు కేర‌ళ వచ్చాడు. ఉమేష్ ప్ర‌సాద్ సింగ్ అనే జ‌వానుకి,  అత‌నికి మ‌ధ్య‌ గ‌త రాత్రి 11.30 గం.ల ప్రాంతంలో సెల‌వు విష‌యంలో వివాదం చెల‌రేగింది. వాదోప‌వాదాలు పెర‌గ‌టంతో కోపాన్ని నిగ్రహించుకోలేక‌పోయిన ఉమేష్ ప్ర‌సాద్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో రామ్ గోపాల్ మీనాని కాల్చాడు. మీనాని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేకపోయింది. ఆయ‌న మ‌ర‌ణించాడు. కోజికోడ్ జిల్లా,  వాట‌క‌రా ప‌ట్ట‌ణంలోని కొట్టాక‌ల్ లో ఉన్న ఇస్లామిక్ అకాడ‌మీ, ఉన్న‌త పాఠ‌శాల‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది.