అలియా భ‌ట్ త‌న‌ను తాను ఫిజిక‌ల్ గా మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ట‌

ఆర్టిస్ట్ ల టాలెంట్ ను చాటే పాత్ర‌లు ఎప్పుడో గాని వ‌స్తుంటాయి. అలా హాట్ హీరోయిన్ అలియ భ‌ట్ ను ఒక అవ‌కాశం వ‌రించింది.ఉడ్తా పంజాబ్ అనే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ బీహార్ కు చెందిన ఒక హాకి క్రిడాకార‌ణిగా క‌న్పించ‌నుంది. ఈ రోల్ చేయ‌డానికి అలియ త‌న‌ను తాను ఫిజిక‌ల్ గా మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. చాల క‌ష్ట‌ప‌డింద‌ట‌. రియ‌ల్ హాకి క్రిడాకారిణిగా క‌నిపించ‌డానికి .. సినిమా షూటింగ్ కు ముందే హాకి నేర్చుకుంద‌ట‌. ఏకంగా ఒక కోచ్ ను ఏర్పాటు చేసి అలియా కు ట్రైనింగ్ ఇప్పించార‌ట‌. ఫిజ‌క‌ల్ గా ఎన్నో ప్రొబ్ల‌మ్స్ ఎదురైన‌ప్ప‌టికి.. డైరెక్ట‌ర్ సహాయంతో అధిగ‌మించి స్క్రీన్ పై త‌న రోల్ ను బాగా చేసానంటోంది. షాహిద్ క‌పూర్ హీరోగా చేస్తుండ‌గా.. క‌రీనా క‌పూర్ వైద్యురాలిగా ఒక కీ రోల్ చేస్తుంది. వ‌చ్చెనెల్లో ఉడ్తా పంజాబ్ చిత్రం రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి అలియ ప‌డిన శారీరిక శ్ర‌మ కు విడుద‌లైన త‌రువాత ఫ‌లితం బావుండాలని కోరుకుందాం.