ఫ్లాప్ అంటూనే 50కోట్లు కొల్లగొట్టాడు….

కొన్ని సినిమాలు అంతే. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి.వసూళ్లు మాత్రం అదరగొడతాయి. సినిమా బాగాలేకపోయినా అదృష్టం కొద్దీ కొన్ని అంశాలు బాగా కలిసొస్తాయి. బన్నీ నటించిన సరైనోడు సినిమాకు కూడా అలానే బాగా కలిసొచ్చింది. మరో సినిమా పోటీలో లేకపోవడం… వేసవి సెలవులు కలసిిరావడంతో… సరైనోడు సినిమా సులువుగానే 50కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. విడుదలైన పది రోజుల్లోనే ఈ సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం సినిమాలు 50కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాయి. తను హీరోగా నటించకపోయినప్పటికీ…. గోన గన్నారెడ్డిగా తను నటించిన రుద్రమదేవి సినిమా 50కోట్లు ఆర్జించిన క్రెడిట్ కూడా బన్నీకే దక్కుతుంది. సో…. బన్నీ ఖాతాలో సరైనోడు సినిమా 50కోట్లు ఆర్జించిన నాలుగో మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండో వీకెండ్ కూడా దాటేసిన ఈ సినిమాకు రాబోయే వీకెండ్ మాత్రం కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే… ఈ రెండు వీకెండ్లు పోటీలేకుండా సాగిపోయినప్పటికీ… వచ్చే శుక్రవారం మాత్రం సాయిధర్మతేజ నటిస్తున్న సుప్రీమ్, సూర్య నటించిన 24 సినిమాలు రేసులో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కచ్చితంగా బన్నీని అడ్డుకుంటాయని అంచనా వేస్తున్నారు.