విదేశాలకు చెక్కేసిన ప్రభాస్

బాహుబలి-2కు సెలవులు ఇవ్వడంతో యూనిట్ అంతా ఖుషీ చేసుకుంటోంది. ఎండలు మండిపోతున్న వేళ… షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించాడు. మళ్లీ జూన్ లో షూటింగ్ ప్రారంభమౌతుంది. ఈ గ్యాప్ ను లైట్ బాయ్ నుంచి స్టార్ హీరో ప్రభాస్ వరకు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి… కుటుంబసభ్యులతో కలిసి ఆస్ట్రేలియా చెక్కేశాడు. మిగతా యూనిట్ సభ్యులు కూడా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ వెళ్లిన ప్రభాస్… అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తాడట. ప్రభాస్ కు ఎప్పట్నుంచో ఆఫ్రికా దేశాల్లో పర్యటించాలనే కోరిక ఉంది. ప్రకృతి సోయగాలు చూడాలంటే ప్రపంచంలో ఆఫ్రికా దేశాలకు మించింది లేదు. అందుకే సరైన సదుపాయాలు లేనప్పటికీ ప్రకృతి ప్రేమికులు ఆఫ్రికా ఖండానికే వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రభాస్ కూడా దుబాయ్ టూర్ తర్వాత ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తారు. 10 రోజుల విదేశీ పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్ వచ్చి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని, కుటుంబసభ్యులతో గడపాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.