అప్పుడు బొండు మ‌ల్లి..ఇప్పుడు స‌న్న‌జాజి ? 

హీరోయిన్ అంటే  ఉండాల్సిన‌ తొలి ల‌క్ష‌ణం అందం. బికినీలో అందాల  అర‌బోయ‌లేక పోయినా ఫ‌ర్వాలేదు కానీ ఒంపులు తిరిగిన శ‌రీరం ఉండాల్సిందే. లావుగా వున్నా అభిన‌యంతో  ఆకట్టుకోవ‌డం అప్ప‌టి నాయ‌క‌ల‌కు చెల్లింది.  కానీ ఇప్ప‌టి  జ‌న‌రేష‌న్ కు క‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు ముద్దుగుమ్మ‌లంతా   స‌న్నాజాజి గా క‌నిపించ‌డానికే ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్నారు.  అటువంటి  వారిలో   సోనాక్షి సిన్హా కూడ చేరింది.  నిన్న‌టి  త‌రం  సూప‌ర్ స్టార్ అయిన శ‌త్రుఘ్న సిన్హా న‌ట వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌..  కెరీర్ ప్రారంభంలో చాల బ‌రువు వుండేది. దాదాపు 90 కేజిల బ‌రువవు ఉండేది.  వ్యాయ‌మం ఏది లేకుండా..జంక్ ఫుడ్ బాగ తిన‌డం వ‌ల‌న  బాగా లావు అయ్యింద‌ట‌. 
అయితే త‌ను న‌టిగా ఎంట్రీ ఇచ్చేనాటికి  అంటే ద‌బంగ్ చిత్రంలో  న‌టించే స‌మ‌యానికి  30 కేజిల బ‌రువు త‌గ్గించింద‌ట‌. ఇప్పుడు సొనాక్షి క‌నిపిస్తున్న స‌న్నాజాజి లాంటి లుక్ కోసం  చాల క‌ష్ట‌ప‌డింద‌ట‌. రెగ్యుల‌ర్ వ్యాయ‌మం , సిస్ట‌మేటిక్  ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌నే ఇదే సాధ్య ప‌డింద‌ట‌.  మొత్తం మీద  బాలీవుడ్ లో క‌రీనా క‌పూర్ ప్రారంభించిన జీరో సైజ్  ట్రెండ్..   హీరోయిన్స్ కు  ఒక గైడ్  గా మారింది అన‌డం అతిశ‌యోక్తి కాదు.  ఇదే త‌ర‌హాలో సోన‌మ్ క‌పూర్,  అలియ భ‌ట్ లు కూడా  వ‌ర్కువుట్ లు చేసి స‌న్నా జాజులుగా మారిన విష‌యం తెలిసిందే.