గెస్ట్ ఎప్పీయరెన్స్ రివర్స్ అయింది…

ఎంతో పలుకుబడి, పాపులారిటీ ఉంటేనే గెస్ట్ ఎప్పీయరెన్స్ పాత్రలొస్తాయి. చిన్నాచితకా హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తే ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకు మగధీర సినిమానే తీసుకుందాం. చరణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో మెగాస్టార్ తళుక్కున మెరిశారు. దీంతో ఆ మూవీకి మంచి హైప్ వచ్చింది. ఈమధ్య వచ్చిన బ్రూస్ లీలో కూడా చిరంజీవి గెస్ట్ రోల్ చేశాను. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా… చిరు ఎంట్రీ అభిమానుల్ని అలరించింది. ఇప్పుడా గెస్ట్ రోల్స్ ఎప్పీయరెన్స్ రివర్స్ అయింది.
ఇన్నాళ్లూ చెర్రీ సినిమాలో చిరంజీవి కనిపిస్తే…. త్వరలోనే చిరు సినిమాలో చెర్రీ కనిపించబోతున్నాడు. అవును… మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం… చిరంజీవి 150వ సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మాంచి హైప్ తో ఉన్న చిరు 150వ సినిమాకు మరింత హైప్ తీసుకురావాలంటే రంగంలోకి దించాల్సింది చరణ్ ను కాదని అంటున్నారు చాలామంది.
నిజంగా 150వ సినిమాను ఆకాశం ఎత్తులో నిలబెట్టాలంటే… ఏ ప్రత్యేక పాత్రనైతే చరణ్ కు ఇద్దామనుకుంటున్నారో… ఆ పాత్రను పవన్ కు ఇస్తే ప్రాజెక్టు అదిరిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు చిరు అడిగితే పవన్ కాదనే స్థితిలో కూడా లేడు. ఎందుకంటే ఇద్దరూ బాగా కలిసిపోయారు కదా… థింక్ బిగ్ అంటే ఇదే. కాస్త మెగా కాంపౌండ్ కూడా ఈ దిశలో ఆలోచిస్తే మంచిదేమో…
Click on Image to Read:
allu-arjun-pawan
pawan-new-movie
puri
anushka
sardar
ramcharan
srinu-vaitla-varun-tej