త‌ప్పులు చేసిన అనుష్క‌..! 

అస‌లు సినిమా  ఇండ‌స్ట్రీకి ఏ మాత్రం  సంబంధం లేకుండా జీరో స్టేజ్ నుంచి వ‌చ్చి  స్టార్ హీరోయిన్ గా ఎదిగిన న‌టి  అనుష్క‌. కెరీర్ ప్రారంభంలో  త‌న‌కు స‌రిగా మేక‌ప్ చేసుకోవ‌డం కూడా తెలిసేది కాద‌ని… కెమెరా ముందు నిల‌బ‌డ‌టం కూడా తెలియ‌ద‌ని త‌నే ప‌లు మార్లు  మీడియాకు తెలిపిన విష‌యం తెలిసిందే.  కెరీర్ ఎండ్ అవుతుంది అనుక‌న్న స‌మ‌యంలో అరుంధ‌తి చిత్రం త‌న‌ను  సూప‌ర్ స్టార్ చేసింది. ఆ త‌రువాత  బాహుబ‌లి,  రాణిరుద్రమ్మ‌, సైజ్ జీరో వంటి చిత్రాలు  త‌న స్థాయిని  న‌టిగా  మ‌రో మెట్టుకు తీసుకెళ్లాయి.   న‌టిగా ఓన మాలు కూడా తెలియ‌ని స్టేజ్ నుంచి…  అనుష్క మంచి న‌టి అనిపించుకునే స్థాయికి రావ‌డం అంటే సంతోష‌మే క‌దా  అనేది ఆమే ఫిలాస‌ఫి క‌రెక్టే క‌దా..?  ప్ర‌స్తుతం బాహుబ‌లి 2  చిత్రంతో బిజీగా   వున్న ఈ ముద్దుగుమ్మ‌.. వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్  అయ్యింది.