ఆ హీరోయిన్ ను చూసి అవాక్క‌య్యారు..! 

చాలెంజ్  గా చేసే రోల్స్  ఎప్పుడో ఒక‌సారి  న‌టీ న‌టుల‌కు వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు  వాళ్ల స‌త్తాను  నిరూపించుకునే అవ‌కాశం  వ‌స్తుంటుంది.  తాజాగా  ఉడ్తా పంజాబ్ చిత్రంలో    హీరోయిన్ అలియ భ‌ట్ కు  ఆ త‌ర‌హా  గోల్టెన్ చాన్స్  వ‌చ్చింది.   ఆ చిత్రంలో   ఒక గ్రామీణ  బీహారి  యువ‌తిలా న‌టించింది. ఆ పాత్ర కోసం  బీహారీ నేర్చుకుంది. అచ్చంగా గ్రామీణ   యువ‌తిలా మారింది.  క‌థ‌లో త‌న క్యారెక్ట‌ర్ డిమాండ్ మేర‌కు ముత‌క దుస్తులు వేసుకుంది. మాసిన జుత్తు, ముఖం పై గాయాలు.. ఆ పాత్ర గురించి వివ‌రిస్తే..ఇటువంటి క‌ష్టాలు చాలా వుంటాయి. ఈ చిత్రం ట్రైల‌ర్  రిలీజ్  స‌మ‌యంలో  త‌న రోల్ గురించి చెప్పింది.   ఈ పాత్ర‌కు త‌న‌ను ఎంపిక చేయ‌డానికి  ద‌ర్శ‌కుడు అభిషేక్ ప‌ట్టు బ‌ట్టార‌ట‌. ఆ పాత్ర కు త‌న‌ను సూచించింది  ఈ చిత్రంలో  హీరో రోల్ చేసిన షాహిద్ కపూరేన‌ట‌.  మొత్తం మీద ఈ పాత్ర ఇంత బాగా వ‌చ్చిందంటే ఇదంతా త‌న కాస్టూమ్ డిజైన‌ర్, అండ్ డైరెక్ట‌ర్ గొప్ప‌త‌న‌మేన‌ని చెప్పుకొచ్చింది.ఈ చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్దం అవుతుంది.