పరువు హ‌త్య‌ని ఆపిన పోలీసులు!

కూతురు త‌మ కులం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంద‌నే కోపంతో అల్లుడిని హ‌త్య చేయించాల‌నుకున్నాడు ఓ వ్య‌క్తి. అత‌నితోపాటు కొడుకు, ఆ కొడుకు స్నేహితులు కూడా క‌లిసి ప‌థ‌కం ర‌చించారు. పోలీసులు ఈ కేసులో  తండ్రీ కొడుకుల‌ను, కొడుకు స్నేహితులు ఇద్ద‌రిని  అరెస్టుచేశారు. మ‌రో ముగ్గురు ప‌రారీలో ఉన్నారు. తండ్రీ కొడుకులు క‌రీంన‌గ‌ర్‌కి చెందిన ఐల‌య్య‌, మ‌ధుసూద‌న్ కాగా మిగిలిన ఇద్ద‌రు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుండి  వ‌చ్చిన‌ శ్యామ్ సుంద‌ర్‌, కృష్ణ‌కుమార్ శ‌ర్మ‌. కొన్ని నెల‌ల క్రితం ఐల‌య్య కుమార్తె, త‌మ కులానికి చెంద‌ని సుధాక‌ర్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. ఆమె అలా కులాంత‌ర వివాహం చేసుకోవ‌డం ఇంట్లో వారెవ‌రీకీ న‌చ్చ‌లేదు. దాంతో ఐల‌య్య  సుధాక‌ర్‌ని చంపాల‌ని ప్లాన్ వేశాడు. ఈ విష‌యంపై  పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఐల‌య్య‌తో పాటు కొడుకు, అత‌ని స్నేహితులు కూడా చేతులు క‌లిపిన‌ట్టుగా తెలు సుకున్న పోలీసులు న‌లుగురిని అరెస్టు చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రో ముగ్గురికోసం గాలిస్తున్నారు.  అరెస్ట‌యిన వారినుండి పోలీసులు  దేశవాళీ తుపాకిని బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.