ఢిల్లీలో వంట‌వాడు…భార్య‌ని ముక్క‌లు చేశాడు!

భ‌యాన‌క‌మైన ఈ ఘ‌ట‌న‌ ద‌క్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. గుల్‌బుద్దీన్ వృత్తిరీత్యా వంట‌వాడు. వ‌య‌సు 40సం. అత‌ని భార్య ఫ‌ల్లు బేగం. అయితే ప‌నిమీద కొన్నాళ్లు అసోంలో ఉన్న గుల్‌బుద్దీన్ అక్క‌డ మ‌రొక మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. దాంతో భార్య‌ని ఎలాగైనా వ‌దిలించుకోవాల‌నుకున్నాడు. అనుకున్న‌ట్టుగానే ఆమెని హ‌త్య‌చేశాడు. త‌రువాత‌ శ‌రీరాన్ని ముక్క‌లుగా న‌రికాడు.  ఫ‌తేపూర్ బెరీ ప్రాంతంలో ఉన్న త‌న ఇంటికి స‌మీపంలో జ‌నం తిర‌గ‌ని ప్రాంతంలో చెత్త‌లో  న‌రికిన శ‌రీర‌ భాగాల‌ను ప‌డేశాడు. శ‌వం కుళ్లిపోయే స్థితిలో ఉన్న‌పుడు ఈ విష‌యం పోలీసుల దృష్టికి వ‌చ్చింది. పోలీసులు ఆ శవం  ఫ‌ల్లు బేగందిగా గుర్తించారు. గుల్‌బుద్దీన్‌ని ప్ర‌శ్నించ‌గా అత‌ను త‌న నేరం ఒప్పుకున్నాడు