కనీసం కొత్త‌ ప్రేమకధలో సిద్ధు సక్సెస్ అవుతాడా ?

ఎక్క‌డైన స‌క్సెస్ అనేది చాల ఇంపార్టెంట్. హీరోగా తెలుగులో స్టార్ డ‌మ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్ద . ఇక్క‌డ కేవ‌లం ల‌వ‌ర్ బోయ్ రోల్స్ కే ప‌రిమితం కావ‌డంతో లాభం లేద‌నుకుని త‌న మాతృసంస్థ కోలీవుడ్ కు చెక్కేశాడు. అక్క‌డ యాక్టింగ్ కు ప్రాధాన్యం వున్న చిత్రాలు చేసి న‌టుడిగా త‌నేంటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. న‌టుడిగా మెప్పించే ప‌నిలో ఎన్నో ప్ర‌యోగాలు చేశాడు. అయితే అవేమి పెద్ద‌గా అచ్చి రాలేదు అక్క‌డ‌.

ప్ర‌స్తుతం తెలుగులో సిద్దార్ధ‌ను పూర్తిగా మ‌ర‌చిపోయారు. ఇటువంటి ద‌శ‌లో చంద‌మామ క‌థ‌లు..గుంటూరు టాకీస్ చిత్రాల ఫేమ్ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ తో ఒక మంచి ల‌వ్ స్టోరి చేయ‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని స‌మాచారం. ఎంత దూరం వెళ్లినా.. సిద్దార్ధ‌కు చివ‌ర‌కు తెలుగులో మ‌ళ్లీ ప్రేమ క‌థ త‌ప్ప వేరే ప్ర‌త్య‌మ్నాయం క‌నిపించ‌లేదు. తెలుగు అభిమానులు త‌న‌ను వేరే రోల్స్ లో చూడ‌లేర‌నే విష‌యాన్ని సిద్దు ఫైన‌ల్ గా అర్దం చేసుకున్న‌ట్లున్నాడు మ‌రి.