తెలంగాణ పోలీసుల‌కు చిక్కిన సుజ‌నా చౌద‌రి కుమారుడు!

sujana son1ఈవ్ టీజింగ్ కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ఉదంతం మ‌ర‌వ‌క‌ముందే తెలంగాణ పోలీసుల‌కు మ‌రో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మంత్రి కొడుకు చిక్కాడు. అయితే, ఆయ‌న ఏపీ కేబినెట్ మినిస్ట‌ర్ కాదు.. కేంద్ర కేబినెట్ మినిస్ట‌ర్. ఇంత‌కీ అత‌గాడెవ‌రంటారా? ఇంకెవ‌రో కాదు.. కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి కుమారుడు సాయికార్తీక్‌. రావెల కుమారుడు అరెస్ట‌యింది నిర్భ‌య చ‌ట్టం కింద కాగా, సుజ‌నా చౌద‌రి కుమారుడు అరెస్ట‌యింది కార్ రేసింగ్‌లో కావ‌డం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కేబీఆర్‌ పార్క్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు కారు రేసింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో అతివేగంగా నడుపుతున్న సుజానా కుమారుడు సాయికార్తీక్‌తో పాటు నలుగురు కారు రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.  సాయి కార్తీక్‌ నడుపుతున్న జర్మన్‌ స్పోర్ట్స్‌ కారు నెంబర్‌ ఏపీ09 సీవీ9699 ను సీజ్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డ వారంద‌రికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. అనంత‌రం వారిని వ‌దిలేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Click on Image to Read:

sujana

patipati-narayana1

cbn-new-politics

nallapureddy-prasanna-kumar

bhuma-cbn

galla-tdp-bjp

tdp-leader-bomb

ambedkar-jayanthi

chandrababu

jagan-yv-subbareddy

jagan-case

peddireddy1

robert-vadra

jagan

petala-sujatha-balakrishna

cbn-read

cm-ramesh

dk-aruna-comments

priyanka-chopra

jagan12131