ప‌దో అంత‌స్తు నుండి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌!

ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప‌ది అంత‌స్తుల భ‌వ‌నం పై నుండి దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న హైద‌రాబాద్, సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా, ఘ‌ట‌కేస‌ర్ మండ‌లంలోని సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో ఉన్న జె న్‌ ప్యాక్ట్  సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆ ఉద్యోగి ప‌నిచేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. సుమారు 30 ఏళ్ల వ‌య‌సున్న ఈ ఉద్యోగి పేరు, ఇత‌ర వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ చేస్తున్నారు. యువ‌కుని వివ‌రాలు, ఆత్మ‌హ‌త్యా లేక హ‌త్యా త‌దితర విష‌యాల‌పై వివ‌రాలను సేక‌రిస్తున్నారు.