అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించను – పవన్, పార్టీ ఫిరాయింపులపైనా స్పందన

ఒక చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినీ హీరో, జనసేన పార్టీ అథినేత పవన్ కల్యాణ్ పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్… జనసేన పార్టీలోకి అన్న చిరంజీవిని ఆహ్వానించే ఆలోచన లేదన్నారు. రాజకీయంగా చిరంజీవితో భేదాభిప్రాయాలు ఉన్నా… కుటుంబపరంగా అందరం కలిసే ఉన్నామన్నారు. మరో రెండు లేక మూడు సినిమాలు చేస్తానని చెప్పారు.

రాజకీయాల్లో తిట్టేవారిని, పొడిగేవారినీ చూశానన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపైనా పవన్ స్పందించారు. ఎమ్మెల్యేలు పార్టీమారడం చూడడానికే ఇబ్బందిగా ఉందన్నారు. ఒక పార్టీపై గెలిచిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఒక వేళ పార్టీ వీడాలంటే బలమైన కారణాలుండాలన్నారు. కానీ ఇప్పుడు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్న కారణాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. 2019లో పవన్‌ను సీఎం అభ్యర్థిగా భావించవచ్చా అన్న ప్రశ్నకు ఆయన చాలాసేపు స్పందించలేదు. అనంతరం తాను పవర్ కోసం రావడం లేదని… ప్రజల కోసం వస్తున్నానని చెప్పారు. జనసేన పార్టీ ప్రశ్నించడానికే వచ్చిందని పోటీ చేయడానికి 2019 ఉందన్నారు.

పవన్ వచ్చాడు వెళ్లాడు అన్న విమర్శలు తన దృష్టికి కూడా వచ్చాయన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైనదన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే తనను కులంతో ముడిపెడుతున్నారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు పూర్తిగా మానేస్తానన్నారు. అయితే సినిమాలు ఎప్పుడు మానేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. తాను చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని, నెలగడవాలంటేనే కష్టంగా ఉందన్నారు. నెలనెల స్టాప్‌కు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నానని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పార్టీ నిర్మాణంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సంస్కృతి పరంగా తెలంగాణ, ఏపీ ఎప్పుడూ కలవలేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని తాము మరిచిపోలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్నారు. జనసేన స్థాపించినప్పుడు ప్రజారాజ్యం అనుభవం గురించి ఆలోచించలేదన్నారు.

Click on Image to Read:

pawan abcd

bhuma

botsa

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

CPI-Narayana-Chandrababu-na

lokesh11

narayana

cbn-chaganti

devansh

pawan-sardar-gabbar

pawan12345

sardaar-gabbar-singh-movie-