సర్దార్ కు దెబ్బమీద దెబ్బమీద

సర్దార్ సినిమా ఇప్పటికే నెగెటివ్ టాక్ తో తెగ ఇబ్బంది పడుతోంది. ఈ వీకెండ్ గడిస్తే సినిమా పరిస్థితి ఏంటనే ఆలోచనలో, బాధలో నిర్మాతలు సతమతమవుతున్నారు. ఇలాంటి టైమ్ లో సినిమాకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఊహించని షాక్ ఒకటి ఎదురైంది. అవును… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పైరసీ బారిన పడింది. అత్తారింటికి దారేది, లౌక్యం తరహాలో హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ బయటకొచ్చింది. 44దేశాల్లో సినిమా విడుదలకావడంతో… ఎక్కడ్నుంచి ఇది పైరసీకి గురయిందనే విషయాన్ని తేల్చలేకపోతున్నారు. ఓవైపు హిందీ వెర్షన్ కు సంబంధించి ఇప్పటికే కెమెరా ప్రింట్ నెట్ లో ప్రత్యక్షం కాగా… తాజాగా తెలుగు వెర్షన్ ఫుల్ క్లారిటీతో ఇంటర్నెట్ లోకి రావడం… నిర్మాతలకు కలవరపెడుతోంది. ఇప్పటికే ఫ్లాప్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా పైరసీ బారిన కూడా పడిందంటే… సోమవారం నుంచి ఎవడూ సినిమా థియేటర్ వంక చూడడు. కనీసం మరో వీకెండ్ వరకైనా సర్దార్ సినిమా నడిస్తే…. డిస్ట్రిబ్యూటర్లు కాస్త కోలుకుంటారు. ఈ పైరసీ ప్రింట్ ఆ అవకాశం కూడా లేకుండా చేస్తుందేమో….

Click on Image to Read:

sardar-gabbar-singh

pawan-sardar-gabbar

cbn-chaganti

pawan12345

sardaar-gabbar-singh-movie-