క‌డియం, లక్ష్మారెడ్డిల‌కు ఉగాది వార్నింగ్‌!

ఉగాది సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన పంచాంగ శ్ర‌వ‌ణంలో పండితులు చెప్పిన ఓ విష‌యం ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో తీవ్ర చ‌ర్చానీయాంశంగా మారింది. దుర్మిఖి నామ సంవ‌త్స‌రంలో అంతా బాగానే ఉంటుంద‌ని, కానీ, వైద్యారోగ్య, ఉన్న‌త విద్య శాఖ‌ల్లో అవినీతి పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని పండితులు జోస్యం చెప్పారు. దీంతో వేదిక‌పై ఉన్న ఉప‌ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ‌హ‌రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ఉలిక్కిప‌డ్డారు. అంతా బాగానే ఉంద‌నుకున్న స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌లు అంతా చూస్తున్న పంచాంగ శ్ర‌వ‌ణంలో తాము బాధ్య‌త‌లు వ‌హిస్తున్న రెండు శాఖ‌ల పేర్లే చ‌ర్చ‌కు రావ‌డం వారికి మింగుడు ప‌డ‌టం లేదు. పంచాంగ శ్ర‌వ‌ణం ముగిసిన వెంట‌నే వారిద్ద‌రూ వెళ్లి పండితులు గారిని అడిగారంట‌.
దీనికి ఆయ‌న ఎలాంటి స‌మాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.  అయితే పంచాంగ శ్ర‌వ‌ణం ద్వారా ఆ రెండు శాఖ‌ల మంత్రుల‌ను రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు సీఎం కేసీఆరే హెచ్చ‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అన్ని శాఖ‌ల్లో ఏం జ‌రుగుతుందో.. ఇంటెలిజెన్స్ ద్వారా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెప్పించుకుంటూనే ఉన్నారు. బ‌హుశా వారిద్ద‌రి శాఖ‌ల‌పై ఆయ‌న‌కు ఏదైనా స‌మాచారం అంది ఉంటుందని, అందుకే ముంద‌స్తుగా పంచాంగ శ్ర‌వ‌ణం ద్వారా ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేశార‌ని పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై కేసీఆర్ వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. పంచాంగం కేవ‌లం జ‌ర‌గ‌బోయే విష‌యాల‌ను మాత్రమే చెబుతుంద‌ని, వాటిని త‌ల‌చుకుని భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని భరోసా ఇచ్చారు. ఏదేమైనా పండ‌గ రోజు ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు వార్నింగ్ ప‌డింది.

Click on Image to Read:

lokesh11

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

pawan-sardar-gabbar

venu

cbn-chaganti

Yarlagadda-Lakshmi-Prasad

pawan12345

kamineni

sardaar-gabbar-singh-movie-