సర్దార్ కు మిగిలింది వారం రోజులే

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ తరుముకొస్తోంది. ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలి. ఒకేసారి హిందీలో కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి… ఎట్టిపరిస్థితుల్లో ఆ టైమ్ కు సినిమాను థియేటర్లలోకి దించాలి. అలా చేయాలంటే కనీసం 5 రోజుల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. 3 రోజుల ముందు సెన్సార్ కంప్లీట్ కావాలి. తక్షణం ప్రమోషన్ షురూ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఈపాటికే షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ టీం ఫ్రెష్ గా ఇప్పుడు స్విట్జర్లాండ్ టూర్ ప్లాన్ చేసింది. ఆల్రెడీ పవన్, కాజల్ తో పాటు ఓ టీం అక్కడ ల్యాండ్ అయిపోయింది. మిగిలిపోయిన 2 పాటల్ని అక్కడ షూట్ చేస్తారు. వీలైనంత తొందరగా ఆ 2 పాటల్ని కంప్లీట్ చేసుకొని, తిరిగి ఇండియా వచ్చేస్తుంది సర్దార్ టీం. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్. రీ-రికార్డింగ్, ప్రమోషన్ ఇలా అన్ని పనుల్ని పూర్తిచేస్తారు. సో… షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ చేయడానికి సర్దార్ టీం కు కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంటుంది.