ఊపిరిలో కూడా మన్మధుడే

రేపు విడుదలకాబోతున్న ఊపిరి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి బయటకొచ్చింది. సినిమాలో చాలా భాగం వీల్ ఛైర్ కే పరిమితమైపోయినట్టు నాగ్ ను చూపిస్తున్నప్పటికీ…. అతడికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టారు. ఆ ఎపిసోడ్ లో ఏకంగా ఇద్దరు లవర్స్ ను మెయింటైన్ చేసే క్యారెక్టర్ లో నాగ్ కనిపించనున్నాడట. బ్యాక్ గ్రౌండ్ లో నాగ్ లవర్స్ గా శ్రియ, అనుష్క కనిపిస్తారని తెలుస్తోంది. ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కార్తి లవర్ గా తమన్న నటించిందట. నాగ్-శ్రియ, నాగ్-అనుష్క మధ్య వచ్చిన సన్నివేశాలు ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయని అంటోంది సినిమా యూనిట్. మరోవైపు ఈ ఎలిమెంట్ పై స్పందించడానికి వంశీ పైడిపల్లి సిద్ధంగా లేడు. సినిమాలో కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాత్రమే చెబుతున్న పైడిపల్లి…. విడుదలకు ముందే వాటిని చెప్పడానికి ఇష్టపడడం లేదు. అయితే ట్రయిలర్ లో చూసిన దానికంటే భిన్నంగా ఊపిరి సినిమా ఉంటుందని మాత్రం చెబుతున్నాడు. చూడ్డానికి సీరియస్ గా కనిపించే సినిమాలో ఫన్నీ సీన్స్ చాలానే ఉంటాయని ఊరిస్తున్నాడు.