కాజల్ లో అది మిస్సయిందట…?

మగధీర ముద్దుగుమ్మ కాజల్ పనైపోయిందని చాలామంది అన్నారు. కానీ అలా విమర్శలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బడా ఆఫర్ తో కాజల్ తెరపైకి వస్తూనే ఉంది. కాజల్ ఇక సినిమాలు మానేయడం బెటరని అంతా అనుకున్న టైంలో టెంపర్ సినిమా చేసింది. పోనీ ఆ మూవీ తర్వాత ఇక దుకాణం సర్దేసుకుంటుందని అనుకుంటే… ఆ వెంటనే బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించింది. ఎంతోమంది భామలు ఉన్నప్పటికీ… ఇప్పటికీ నిర్మాతలు, హీరోలు కాజల్ కు అవకాశాలివ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇకపై అంత సీన్ ఉండకపోవచ్చని అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే… కాజల్ లో అప్పటి మెరుపు, నునుపు తగ్గిందనేది వీళ్ల వాదన. సర్దార్ గబ్బర్ సింగ్ లో కాజల్ ఫేస్ చూసి చాలామంది ఇదే ఫీలయ్యారు. ఆమె ముఖంలో ఏజ్ బార్ లుక్స్ వచ్చేశాయని పెదవి విరిచారు చాలామంది. నవ్వుతుంటే… చాలా కృత్రిమంగా ఉందని, కళ్లలో చలాకీదనం, చిలిపితనం లోపించాయని కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సేమ్ టు సేమ్ కామెంట్స్… బ్రహ్మోత్సవం సెట్స్ లో కూడా వినిపిస్తున్నాయి. మరి ఈసారి కాజల్… ఎలాంటి ఆఫర్ తో ఈ కామెంట్స్ కు చెక్ చెబుతుందో చూడాలి.