తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వంశీచంద్ రెడ్డి వెళ్లారు. అయితే హెచ్‌సీయూలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వంశీచంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఆయన గేటు వద్దే బైఠాయించారు. ఈ నేథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్నహెచ్సీయూ … క్యాంపస్‌కు వివాదాస్పద వీసీ అప్పారావు తిరిగి రావడంతో రచ్చ మొదలైంది. వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం వీసీ చాంబర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వర్శిటీకి చేరుకున్న పోలీసులు విద్యార్థులపై తీవ్రస్థాయిలో లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మొత్తం వర్శిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Click on Image to Read: