మ‌ళ్లీ గ‌ర్జించిన ట్వీట్ టైగ‌ర్ వ‌ర్మ‌..!

రామ్ గోపాల్ వ‌ర్మ కు ఈ మ‌ధ్య ట్విట‌ర్ సెల్ఫ్ మీడియా అయ్యిందంటే అతిశ‌యోక్తి కాదు. ఈ మ‌ధ్య త‌న కొత్త చిత్రం వంగ‌వీటి సినిమాకు ప్రచారమే అందుకు చిన్న ఉద‌హారణ. క‌ట్ చేస్తే.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో విడుద‌ల నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించి కామెంట్స్ చేశాడు. చిరంజీవి మాట్లాడింది అంతా అబ‌ద్దాలే అన్న‌ట్లు తేల్చాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడింది మాత్రం నిజం .. ఆయ‌న హృద‌య పూర్వ‌కంగా మాట్లాడితే.. చిరంజీవి చాలా కృత్రిమంగా మాట్లాడారంటూ ట్విట్స్ చేశారు. మ‌రి అన్న‌ద‌మ్ముల్లో ఒక‌ర్ని పొగిడి.. మ‌రొక‌ర్ని తిట్టడం వెన‌క వ‌ర్మ ఉద్దేశ్యం ఏమిటో ఆయ‌న‌కే తెలియాలి. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం బాలీవుడ్ లో.. బాహుబ‌లిని ఓవ‌ర్ టేక్ చేసే విధంగా క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని సైట‌ర్స్ విసిరారు. మొత్తం మీద స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం మన ట్వీట్ల‌ టైగ‌ర్ కు ఒక కాలక్షేపం అయిందన్నమాట‌.