రామ్ చరణ్ కోసం రక్తంతో రికార్డు

తన ప్రమేయం లేకుండానే చెర్రీ ఒక రికార్డు సృష్టించబోతున్నాడు. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కేయబోతున్నాడు. చరణ్ కోసం అతడి అభిమానులు ఇలా గిన్నిస్ బుక్ ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 27న రామ్ చరణ్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ పుట్టినరోజు నాడు ఏకంగా లక్షా 11వేల 116 బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని ఫ్యాన్స్ నిర్ణయించారు. అలా ఒకే రోజులో ఇన్ని శాంపిల్స్ కలక్ట్ చేసిన వ్యక్తిగా చెర్రీ పేరును గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం భారీగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటుచేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో దాదాపు 190 క్యాంపులు ఏర్పాటుచేస్తున్నారు. ముంబయిలో 9, బెంగళూరులో 3, అమెరికాలో ఒక బ్లండ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి క్యాంపులో కనీసం వెయ్యి మంది రక్తందానం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ లాంటి స్వచ్చంధ సంస్థలు కూడా మద్దతు పలకడం విశేషం.