మళ్లీ విషం చిమ్మిన రాజ్‌ థాక్రే

భారత పౌరుడు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కును మన రాజ్యాంగం ప్రసాదించింది.  ఈ  కనీస జ్ఞానం చదువురాని పౌరులకు కూడా ఉంది. కానీ నేతలు మాత్రం కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అలా దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి బతకడంలో మహారాష్ట్రకు చెందిన ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌థాక్రే ముందుంటారు. తాజాగా అందరు కలిసి జరుపుకోవాల్సిన హోలీ పండున నాడు విధ్వేషాలను రెచ్చగొట్టారు. ముంబైలోని ఉత్తరాదివారిని హోలీ నాడు తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు. వారిపై దాడులు చేయాలని రాజ్‌సేనని రెచ్చగొట్టారు.

రాజ్‌థాక్రే ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారి కాదు.  2010లో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఉత్తరాది విద్యార్థులపై రాజ్‌ థాక్రే దాడులు చేయించారు. ముంబైలో యూపీ, బిహారీ టాక్సీ డ్రైవర్లను చితకబాదారు.ఇలా చేయడం ద్వారా ముంబైలో పట్టుసాధించాలనుకున్నారు. కానీ ఈ విధ్వంసం రాజకీయాలను ముంబైవాసులు ఎప్పికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు.   అందుకే అసెంబ్లీలో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా ఎంఎన్‌ఎస్‌కు లేరు. అయినా రాజ్‌ థాక్రే తీరు మాత్రం మారలేదు. వీలు దొరికినప్పుడల్లా ముంబైలోని ప్రజల మధ్య చిచ్చుపెడుతూనే ఉన్నారు. ఆ కోవలోనే హోలీనాడు ఉత్తరాదివారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్‌ థాక్రే వ్యాఖ్యలు మహారాష్ట్రలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.