ప‌వ‌ర్ స్టార్ సినిమాల్ని ఎందుకు వ‌ద‌ల‌డంటే..?

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్ర ఆడియో లో చిరంజీవి ఒక విష‌యం నొక్కి చెప్పారు. కోట్లాది మంది అభిమానుల్ని మ‌న‌కిచ్చింది సినిమానే. వాళ్లు ఆద‌రిస్తున్నంత కాలం సినిమాల్ని మ‌నం వ‌ద‌లకూడ‌ద‌ని .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల నుంచి విరామం తీసుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాబోద‌ని చిరు చెప్పాడు. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జ‌న‌సేన స్థాపించిన త‌రువాత‌.. రాజ‌కీయాల్లో గాలి వాటంగా వ్య‌వ‌హ రిస్తున్నారు. తానొప్పించ‌క తానొవ్వ‌క త‌ప్పించుకు తిరుగువాడే ధ‌న్యుడు సుమ‌తి అన్న చందంగా పాలిటిక్స్ చేస్తూన్నారు. అటు పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే సాహాసం చేయ‌డం లేదు. అలాగ‌ని .. పాలిటిక్స్ ను వ‌దులుకోవ‌డానికి సిద్దంగాను లేడు. గ‌త ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో బిజేపి, తెలుగుదేశం మిత్ర ప‌క్షంగా ఆ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపాడు. బిజేపి ఆఖండ విజ‌యం సాధించిన త‌రువాత‌.. మోడీనే స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మొత్తం మీద రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్ లో స‌మ‌యం , సంద‌ర్భం, గాలి వాటం చూసుకుని అనుకూలంగా వ్య‌వ‌హారించ‌డ‌మే తప్ప .. త‌ను స్వయం అవ‌తారం ఎత్తే చాన్స్ లేదు. త‌న ఉనికిని మోడి వంటి నాయకుల‌కు చాటుకోవాలంటే.. సినిమాల ప‌రంగా అభిమానుల్ని అల‌రిస్తూనే ఉండాలి. ఎందుకంటే యూత్ లో త‌న బ‌లం ఉన్నంత వ‌ర‌కే జాతీయ పార్టీల నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌ట్టించుకునేది. ఆ విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బాగా అర్ధం అయ్యి వుంటుంది. కాబ‌ట్టి.. ప‌వ‌ర్ స్టార్ సినిమాల నుంచి రెండు మూడు సంవ‌త్స‌రాల త‌రువాత అయిన రిటైర్ట్ అయ్యే అవ‌కాశమే లేదనేది క్రిటిక్స్ వాదన.