మహేష్ సరసన ఆఫర్ వచ్చినప్పటికీ…. 

స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే పారితోషికం గురించి ఎవరూ ఆలోచించరు. అందులో నటిస్తే ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. ఆ తర్వాత పారితోషికం వద్దన్నా పెరుగుతుంది. కానీ స్టార్ హీరో సరసన ఛాన్స్ తో పాటు… కళ్లుచెదిరే మొత్తం కూడా అందుకునే భామలుంటారు. ఆ కోవలోకే పరిణీతి చోప్రా వస్తుంది. బాలీవుడ్ లో తనకంటూ కొన్ని హిట్స్ తెచ్చుకున్న ఈ భామ…. మురుగదాస్-మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పక్కా అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఆ ప్రాజెక్టులో నటించేందుకు పరిణీతికి ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు ఇస్తున్నారట. మహేష్ సరసన నటించడానికి బాలీవుడ్ కే చెందిన శ్రద్ధాకపూర్ లాంటి ఎంతో భామలు రెడీగా ఉన్నప్పటికీ… అంత డబ్బిచ్చి మరీ పరిణీతిని తీసుకుంటున్నారు. సౌత్ లో నటించడానికి అంత మొత్తం తీసుకున్న హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ తర్వాత పరిణీతి మాత్రమే నిలిచింది. రోబో సినిమాలో నటించేందుకు ఐష్ ఏకంగా 6 కోట్లు తీసుకుందట.