ఆరడుగుల బుల్లెట్ పవన్ కాదు… ఎన్టీఆర్…

పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్నుంచి  పవన్ ను ఆరడుగుల బుల్లెట్ గా చెప్పుకోవడం ఫ్యాన్స్ కు అలవాటు అయిపోయింది. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే వాక్యాన్ని వాడేస్తున్నారు. పవన్ కంటే ఎన్టీఆర్ కే ఇది పక్కాగా సూటవుతుందని అంటున్నారు. దానికి కారణం సినిమా మేకింగ్ లో ఎన్టీఆర్ వేగమే. అవును… జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి హోల్ సేల్ గా కాల్షీట్లు కేటాయించిన తారక్…. గ్యాప్ లేకుండా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ముంబయి షూటింగ్ ను కూడా ఫినిష్ చేశాడు యంగ్ టైగర్. త్వరలోనే హైదరాబాద్ సారధి స్టుడియోస్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో సినిమాకు సంబంధించిన దాదాపు 70శాతం పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా బుల్లెట్ లా దూసుకుపోతున్నాడు కాబట్టే…. ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యాన్స్ ఆరడుగుల బుల్లెట్ అంటూ పొగిడేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయడానికి దాదాపు ఫిక్స్ అయిపోయారు.